Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూగ జీవాల కోసం జీవిత భాగస్వామిని వదులుకున్న మహిళ!

  • ప్రేమ వివాహం చేసుకున్న లిజ్‌, మైక్‌ 
  • లిజ్‌ కుక్కల బెడద భరించలేక నోరు జారిన మైక్‌
  • భర్తను వదిలేసిన లిజ్‌
‘జాలి లేని కొడుకు కంటే కుక్క మేలురా’ అన్నాడో సినీ కవి. అక్షరాలా ఆమె అలాగే అనుకుంది. జాలి లేని భర్త కంటే కుక్కలే మేలని అతనితో తెగదెంపులు చేసుకుంది. తన పెంపుడు కుక్క కోసం ఏకంగా జీవిత భాగస్వామినే వదులుకుందో మహిళ.

వివరాల్లోకి వెళితే...ఇంగ్లండ్‌లోని బ్రన్హమ్‌కు చెందిన లిజ్‌కు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ప్రాణం. బాల్యం నుంచి వాటితోనే గడిపింది. ఆమె తండ్రి పశువుల ఆహారాన్ని అమ్మేవారు. పదహారేళ్ల వయసులో మైక్‌ హస్లమ్‌ ప్రేమలో పడిన లిజ్‌ అతని కోసం తన తల్లిదండ్రులను కూడా కాదనుకుంది. 1991లో లిజ్‌, మైక్‌లు పెళ్లి చేసుకుని బ్రన్హమ్‌లో వేరు కాపురం పెట్టారు. ఆ తర్వాత లిజ్‌ కుక్క పిల్లల వ్యాపారం మొదలు పెట్టింది. ప్రస్తుతం వీరికి 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తొలి రోజుల్లో ఒకటి రెండు కుక్కల్ని పెంచేది. దీంతో మైక్‌ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. రానురాను ఇంట్లో కుక్కల సంఖ్య పెరుగుతుండడంతో అతనిలో అసహనం కూడా పెరిగి పోయింది.

లిజ్‌ ప్రస్తుతం 30 కుక్కల్ని సేకరించి ఇంట్లో పెంచుతోంది. దీన్ని తట్టుకోలేక పోయిన మైక్‌ ఓ రోజు నేను కావాలో, కుక్కలు కావాలో తేల్చుకోవాలని భార్యకు అల్టిమేటమ్‌ ఇచ్చాడు. భర్త మాటలతో అసహనానికి గురైన లిజ్‌ మరో మాటకు తావివ్వకుండా ‘నాకు కుక్కలే కావాలి. కావాలంటే నీవు బ్యాగు సర్దుకుని బయటకు పో’ అని తెగేసి చెప్పేసింది. దీంతో చేసేది లేక మైక్‌ బ్యాగు సర్దుకుని బయటకు వెళ్లిపోయాడు.
england
dogs lover

More Telugu News